ఏపీలో భారీ వర్షాలు
AP Heavy Rain I రానున్న నాలుగైదు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ
By సుభాష్ Published on 12 Nov 2020 4:51 AM GMTరానున్న నాలుగైదు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది. ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం.. గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే విశా ఖ, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా శ్రీలం తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర ఆంధ్రా తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గురువారం నాలుగైదు గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ భారీ వర్షాల వల్ల తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ ఏపీలో భారీ వర్ష సూచన రావడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకే ఎంతో నష్టపోయామని, ఇప్పుడ చలి ఎక్కువవుతున్న తరుణంలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారుల సూచనతో మరింత నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.