నెల్లూరు జీజీహెచ్‌ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

AP Govt Serious on nellore GGH incident.నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్న‌తాధికారి లైంగిక వేదింపుల ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2021 12:52 PM GMT
నెల్లూరు జీజీహెచ్‌ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్న‌తాధికారి లైంగిక వేదింపుల ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిప‌డ్డారు. సీనియ‌ర్ వైద్యుల‌తో త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది. సాయంత్రం క‌ల్లా పూర్తి నివేదిక ఇవ్వాల‌ని మంత్రి ఆళ్ల‌నాని ఆదేశించారు. విచారణలో లైంగిక వేధింపులు నిజమే అని తేలితే కఠినంగా చర్యలు ఉంటాయని మంత్రి చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

జీజీహెచ్ ఘ‌ట‌న‌పై రెండు క‌మిటీలు విచార‌ణ చేప‌డుతున్నాయ‌ని నెల్లూరు ఇంచార్జి క‌లెక్ట‌ర్ హ‌రేందిర ప్ర‌సాద్ తెలిపారు. ఒకటి డీఎంఈ తరపున ఏసీఎస్‌ఆర్‌ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సాంబశివరావు నేతృత్వంలో 4గురు సభ్యులతో కూడిన కమిటీ కాగా.. మరొకటి జిల్లా తరపున ఇండిపెండెంట్ కమిటీ. జిల్లా కమిటీలో జెడ్పీ సీఈవో , ఐసీడీఎస్ పీడీ, జాయింట్ కలెక్టర్ (ఆసరా)తో త్రిసభ్యులు ఉంటారు.

కాగా.. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ లేదన్నారు. ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి డీఎంఈ కమిటీ కానీ.. డిస్ట్రిక్ట్ కమిటీ కానీ దీన్ని సుమోటోగా తీసుకుంటుందన్నారు. 24 గంటల్లో డిస్ట్రిక్ట్ కమిటీ ప్రిలిమనరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుందన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇంచార్జి కలెక్టర్ ప్రసాద్ చెప్పారు.

Next Story