శుభవార్త.. మహిళల ఖాతాల్లో నేడు రూ.15వేలు జమ
AP Govt inaugurates YSR EBC Nestham Scheme Today.కరోనా కష్టకాలంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను
By తోట వంశీ కుమార్
కరోనా కష్టకాలంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెడుతూ.. ప్రజలకు లబ్ధి చేకూరుస్తూనే ఉన్నారు. తాజాగా 'వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం' పథకానికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ పథకం అందని, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్గాల మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ వంటి అగ్రవర్ణాల్లోని పేద మహిళలు లబ్దిపొందనున్నారు. 45 ఏళ్లకు పైబడి 60 ఏళ్ల లోపు వయసు వారికి ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున మొత్తం మూడేళ్ల పాటు రూ.45వేలు అందించనున్నారు.
అందులో భాగంగా నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి ఆయా మహిళల ఖాతాలకు నగదు బదిలీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 3.92 లక్షల మంది అగ్రవర్ణ పేద మహిళలు ప్రయోజనం పొందనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కోసం ఏపీ ప్రభుత్వం రూ.589 కోట్లు ఖర్చు పెట్టనుంది.
ఈ పథకానికి ఎవరు అర్హులంటే..?
- వార్షిక కుటుంబ ఆదాయం.. గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేలు పరిమితిని మించకూడదు.
- కుటుంబంలో ఎవరూ కూడా ప్రభ్యుత ఉద్యోగి గానీ, పెన్షన్‌ర్ గాని, ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నవారు గానీ ఉండకూడదు.
- కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండవద్దు.
- లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి.
- మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.
మాగాణి, మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.