మురళీమోహన్ కు చెందిన జయభేరి కన్ స్ట్రక్షన్స్ కు భారీ జరిమానా

AP Govt Imposed Fine On Jayabheri Constructions. జయభేరి కన్ స్ట్రక్షన్స్.. ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ గుర్తుకు వస్తారు.

By Medi Samrat  Published on  27 April 2021 5:26 PM IST
Jayaberi constructions

జయభేరి కన్ స్ట్రక్షన్స్.. ఈ పేరు వింటే చాలు ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ గుర్తుకు వస్తారు. ఈ కన్ స్ట్రక్షన్స్ కంపెనీతో ఎన్నో నిర్మాణాలను ఆయన చేపట్టిన సంగతి తెలిసిందే..! పలు ప్రాంతాల్లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను జయభేరి కన్ స్ట్రక్షన్స్ సంస్థ పూర్తీ చేసింది. తాజాగా ఆ కంపెనీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ జరిమానాను విధించింది. అమరావతిని ఆనుకుని ఉండే కుంచనపల్లిలో జయభేరి కన్ స్ట్రక్షన్స్ నిర్మించిన భవనాలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న అధికారులు రూ.1.5 కోట్లు జరిమానాగా విధించారు.

జాతీయ రహదారి పక్కనే ఉండే కుంచనపల్లిలో 7 ఎకరాల 5 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జయభేరి కన్ స్ట్రక్షన్స్ 2016లో నిర్మాణాలు చేపట్టింది. వ్యవసాయ భూమి కాగా దీంట్లోనే నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలు పాటించలేదని జయభేరి కన్ స్ట్రక్షన్స్ పై వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 3 శాతం ల్యాండ్ కన్వర్షన్ ఫీజుతో పాటు జరిమానా కూడా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు రూ.1 కోటి, అపరాధ రుసుం కింద మరో రూ.50 లక్షలు చెల్లించాలని జయభేరి కన్ స్ట్రక్షన్స్ ను ఆదేశించారు.


Next Story