పోలీసు అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్‌

AP govt gives two years of age relaxation to candidates appearing for Constable posts రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2022 8:52 AM GMT
పోలీసు అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. పోలీసు ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వ‌యోప‌రిమితిని రెండేళ్ల పాటు పొడిగించేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అభ్య‌ర్థుల నుంచి వ‌చ్చిన విన‌తి మేర‌కు సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల చాలా మంది నిరుద్యోగులకు ల‌బ్ధిచేకూర‌నుంది.

రాష్ట్ర ప్ర‌భుత్వం 6,511 పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. వాటిలో ఎస్‌ఐ పోస్టులు 411, కానిస్టేబుల్‌ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్‌(పురుషులు, మ‌హిళ‌ల కేట‌గిరీలు), 96 ఏపీఎస్సీ(పురుషులు) పోస్టులు ఉన్నాయి. ఇక 6,100 కానిస్టేబుల్ పోస్టుల్లో 3,850 సివిల్‌, 2,520 ఏపీఎస్సీ పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష ను నిర్వ‌హించ‌నున్నారు.

Next Story