ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇంటర్వ్యూలు రద్దు

AP Government cancelled interviews.ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీపీఎస్సీ పోటీ ప‌రీక్ష‌ల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2021 1:14 PM IST
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇంటర్వ్యూలు రద్దు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీపీఎస్సీ పోటీ ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు ఎత్తి వేస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 స‌హా అన్నికేట‌గిరీ పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీచేశారు. ఇక నుంచి ఉద్యోగా ఎంపిక‌లో ఇంట‌ర్వ్యూలు ఉండ‌బోవ‌ని చెప్పారు. ఉత్త‌ర్వులు వెలువ‌డిన తేదీ నుంచి ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని చెప్పారు.

Next Story