Andhrapradesh: విద్యార్థులకు అలర్ట్‌.. టెన్త్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా...

By -  అంజి
Published on : 8 Dec 2025 8:16 AM IST

AP Education Department, fee payment deadline, 10th class public examinations, Tenth grade students

Andhrapradesh: విద్యార్థులకు అలర్ట్‌.. టెన్త్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా, తాజాగా 18వ తేదీ వరకు గడువు పెంచింది. అలాగే ఫైన్‌ లేకుండా ఈ నెల 9వ తేదీ వరకు, రూ.50 ఫైన్‌తో 12వ తేదీ వరకు, రూ.200 ఫైన్‌తో ఈ నెల 15 వరకు, రూ.500 ఫైన్‌తో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయసుకోవాలని అధికారులు కోరారు.

పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. వచ్చే ఏడాది.. 2026 మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్‌ 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

పరీక్షల తేదీలు

మార్చి 16, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌

మార్చి 18, 2026 – సెకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 20, 2026 - ఇంగ్లీష్‌

మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)

మార్చి 25, 2026 – ఫిజిక్స్

మార్చి 28, 2026 – బయాలజీ

మార్చి 30 , 2026 – సోషల్‌ స్టడీస్‌

మార్చి 31, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌ 2)

ఏప్రిల్‌ 1, 2026 – ఒకేషనల్‌ కోర్సు

Next Story