ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేయగా.. తాజాగా అగ్రికల్చర్ , ఫార్మసీ ఫలితాలను రిలీజ్ చేశారు. మంగళగిరి లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 92.85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 78,066 మంది పరీక్షలకు హాజరయ్యారు. 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తూర్పుగోదావరి జిల్లా కోరకొండకు చెందిన విష్ణు వివేక్‌కు ఫస్ట్ ర్యాంకు రాగా.. అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయకు రెండో ర్యాంకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.