ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫ‌లితాలు విడుద‌ల‌

AP Eamcet 2021 Results out.ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sept 2021 11:26 AM IST
ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫ‌లితాలు విడుద‌ల‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుద‌ల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధ‌వారం ఉద‌యం 10.30గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు https://sche.ap.gov.in/EAPCET, https://sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు అధికారులు మొదట ఎంపీసీ విభాగాల ఫలితాలను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ నేప‌థ్యంలోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు 1,76,603 మంది ద‌రఖాస్తు చేయ‌గా.. 1,66,460 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించారు. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్‌ నిర్వహించేవారు. మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో 'నీట్‌' నిర్వహిస్తుండటంతో మెడికల్‌ విభాగాన్ని ఎంసెట్‌ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్‌ ను ఏపీ ఈఏపీసెట్‌(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)–2021 పేరుతో నిర్వహించారు.

Next Story