ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'వై ప్లస్ సెక్యూరిటీ'
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డును క్రియేట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 11:45 AM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వై ప్లస్ సెక్యూరిటీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డును క్రియేట్ చేశారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు. వందశాతం రిజల్ట్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆయనకు కీలక శాఖలను కేటాయించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్‌కు కేటాయించిన కేటాయించిన విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయా శాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు తీసుకోనున్నారు. పవన్ కల్యాణ్ కోసం చాంబర్‌ను కూడా ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ పవన్‌కు కేటాయించారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వ పరంగా మరిన్ని సదుపాయాలను కల్పించారు. డిప్యూటీ సీఎం పవన్‌కు వై ప్లస్ భద్రతను ఇచ్చారు. అలాగే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. బుధవారం బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్లారు. అక్కడ జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లి రెండో బ్లాక్‌లో ఉన్న తన చాంబర్‌ను పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ pic.twitter.com/iOVZEY021N
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 18, 2024