అండమాన్‌కు పోర్ట్‌ బ్లెయిర్‌గా పేరు మార్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్

కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.

By Srikanth Gundamalla
Published on : 14 Sept 2024 9:30 PM IST

అండమాన్‌కు పోర్ట్‌ బ్లెయిర్‌గా పేరు మార్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్

కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి ఈ ప్రాంతాన్ని 'శ్రీ విజయపురం' పిలవాలని చెప్పింది కేంద్రం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రప్రభుత్వం మార్చడం సంతోమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పవన్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ ఇలా రాసుకొచ్చారు. 'వందల ఏళ్ల పాటు పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, వలసవాద పాలనకు గుర్తుగా వారు పెట్టిన పేరును తీసేస్తూ, భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా "శ్రీ విజయపురం" పేరు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.



Next Story