ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే.. వాళ్లు వదిలేస్తారా?: పవన్ కల్యాణ్
తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 8:12 PM ISTతిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. తిరుమలలో వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఉంటామా? అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీది రాజకీయం, ఓట్ల కోసమేనా? అంటూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు.
అయితే.. తనకు ఏ రాజకీయ పార్టీపై పగలు, ప్రతికారాలు లేవని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గత పదేళ్లలో ఎన్నో అవమానాలను చూశాననీ.. చాలా భరించానని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇప్పటికి 100 రోజులు దాటిందని పవన్ కల్యాణ్ చెప్పారు. వందరోజుల్లో బయటకు రాలేదనీ.. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టామని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికి తిరుపతికి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర మతాల్లో దేవుడిని తిడితే వాళ్లు వదిలేస్తారా అంటూ ప్రశ్నించారు.
తిరుపతిలో కల్తీ ప్రసాదం పెట్టారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల సమయం కాదు.. సినిమా సమయం కాదని కామెంట్ చేశారు. ఇది భగవంతుడి సమయం అన్నారు. ఇతర మతాలను చూసి నేర్చుకోవాలనని చెప్పారు. సనానత హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన చెందారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు కూడా లేదన్నారు. సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని అన్నారు. మిగతా మతాలపై దాడి జరిగితే.. ప్రముఖులంతా మాట్లాడతారన్నారు. తప్పని తెలిసి కూడా మాట్లాడడం ఇంకా తప్పని ఆయన చెప్పారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంత మంది అంటున్నారని తెలిపారు. హిందువులంతా ఏకమయ్యే సమయం అసన్నమైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.