ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

AP Covid -19 cases .. ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 545 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పది మంది

By సుభాష్  Published on  23 Nov 2020 2:46 PM GMT
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 545 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పది మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,62,758 చేరగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 6,948కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 1390 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,42,416కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96,62,220 కరోనా పరీక్షుల నిర్వహించారు.

ఇక తాజాగా తాజాగా పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాలు.. అనంతపురం 19, చిత్తూరు - 32, తూర్పు గోదావరి 104, గుంటూరు 117, కడప 31, కృష్ణ 44, కర్నూలు 10, నెల్లూరు -30, ప్రకాశం - 25, శ్రీకాకుళం - 19, విశాఖ - 21, విజయనగరం - 17, పశ్చిమగోదావరి - 76 చొప్పున పాజిటివ్‌ కేసులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, రాష్ట్రంలో రోజు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, ఈ రోజు ఒక్కసారిగా కేసుల సంఖ్య తగ్గిపోవడంతో ఇక నుంచి కరోనా తగ్గుముఖం పడుతుందేమోనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. వ్యాక్సిన్‌ వచ్చే వరకైనా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి పాటిస్తే పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి ఇంకా పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయి.

Next Story