ఏపీలో క‌రోనా తీవ్ర రూపం.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

AP Coronavirus update Today.ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 35,582 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 4,228 పాజిటివ్ కేసులు న‌మోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2021 12:09 PM GMT
AP Corona cases

ఏపీలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌రూపం దాల్చింది. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 35,582 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 4,228 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 842 కేసులు న‌మోదు కాగా.. ఆత‌రువాత గుంటూరు జిల్లాలో 622, తూర్పుగోదావ‌రిలో 538, విశాఖ జిల్లాలో 414 పాజిటివ్ కేసుల‌ను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,32,892 కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనాతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఈమ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 7,321కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,483కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,99,721కి చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,54,98,728 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు బులిటెన్‌లో వెల్ల‌డించారు
Next Story
Share it