ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్ని కేసులంటే

AP Corona cases .. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 51,854 మందికి కరోనా

By సుభాష్  Published on  1 Dec 2020 12:16 PM GMT
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్ని కేసులంటే

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 51,854 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 685 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,68,749 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మృతి చెందిన వారి సంఖ్య 6,996కి చేరింది. తాజాగా 1,094 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 యాక్టివ్‌ కేసులున్నాయి.

అలాగే గడిచిన 24 గంటల్లో కృష్ణ జిల్లాలో 146 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, చిత్తూరు 95, గుంటూరు 87,ఈస్ట్‌ గోదావరి 77, విశాఖ 71, వెస్ట్‌ గోదావరి 70, నెల్లూరు 39, ప్రకాశం 30, కడప 30, అనంతపురం 18, కర్నూలు 10, విజయనగరం 9, శ్రీకాకుళం 3 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story
Share it