ఏపీ క‌రోనా అప్‌డేట్‌..కొత్త‌గా ఎన్నికేసులంటే..?

AP Corona Bulletin on September 2nd.ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 59,566

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 12:19 PM GMT
ఏపీ క‌రోనా అప్‌డేట్‌..కొత్త‌గా ఎన్నికేసులంటే..?

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 59,566 పరీక్షలు నిర్వహించగా.. 1,378 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,16,680కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల 10 మంది మృత్యువాత ప‌డ్డారు.

దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,877కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,139 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,88,101కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,702 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,67,45,035 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story
Share it