హస్తనకు సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఢిల్లీ పర్యటన ఖరారు అయింది
By అంజి Published on 3 Oct 2023 3:39 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 6న సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వైఎస్ జగన్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో కూడా సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్న సమయంలో సీఎం జగన్ హస్తినకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
అక్టోబర్ 6వ తేదీ విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. చాలా కాలం తర్వాత సీఎం జగన్ ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అవ్వడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండడంతో ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కళాశాలల నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
Next Story