ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం.. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జగన్ భేటీ జరగనుంది. ప్రధాని మంత్రి కార్యాలయం నుంచడి అపాయింట్‌మెంట్ కూడా ఖరారు అయింది. మోదీతో భేటీ తర్వాత సీఎం జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు విభజన హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని, ఈ క్రమంలోనే దీనిపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, ఈ నెల మొదటి వారంలో కూడా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ అధ్యక్షతన జీ20 సదస్సుకు సంబంధించి జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్యా సీఎం జగన్ (Cm jagan) ఢిల్లీ పర్యటన అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.