దావోస్‌లో బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం భేటీ.. ఏఐ వర్సిటీ అడ్వైజరీ బోర్డులో చేరాలని ఆహ్వానం

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.

By Knakam Karthik  Published on  23 Jan 2025 7:03 AM IST
DavosSummit2025, BillGates, Founder of Microsoft, ap cm Chandrababu

దావోస్‌లో బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం భేటీ..ఏఐ వర్సిటీ అడ్వైజరీ బోర్డులో చేరాలని ఆహ్వానం

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీకి అడ్వైజరీ బోర్డులో చేరాలని సీఎం చంద్రబాబు బిల్ గేట్స్‌ను ఆహ్వానించారు. సాంకేతిక పరిజ్ఞానం, విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ తో చెప్పారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నస్టిక్స్‌ను ఏర్పాటు చేయాలని మీటింగ్ సందర్భగా సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు.

బిల్ గేట్స్‌తో భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్ బోర్డులు, సామాజిక కార్యక్రమాలను ఏపీలోనూ నిర్వహించాలని కోరారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సహకారం అందించాలని బిల్‌గేట్స్‌ను కోరినట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్‌పై పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర పురోగతికి బీఎంజీఎఫ్ భాగస్వామి కావాలని అడిగామని అన్నారు.

Next Story