ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోవిద్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని భారత్‌పేట 140వ వార్డు సచివాలయంలో సీఎం జగన్, సతీమణి భారతిలు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం.. వైద్యుల పర్యవేక్షణలో అరగంటపాటు అక్కడే ఉన్నారు. సచివాలయం, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సమావేశమమయ్యారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎం కోరారు.
వైఎస్ జగన్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్ కేంద్రం, వ్యాక్సిన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్‌ను హోం మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్‌యాదవ్‌లు బుధవారం పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని అధికారులకు వైఎస్ జగన్ సూచించారు.