సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌.. భౌతికంగా దూర‌మై 12 ఏళ్లు అయినా..

AP CM Jagan Emotional tweet.దివంగత నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 4:01 AM GMT
సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌.. భౌతికంగా దూర‌మై 12 ఏళ్లు అయినా..

దివంగత నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, సీఎం జ‌గ‌న్ నివాళులు అర్పించారు. ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ ఘాటు వ‌ద్ద ప్ర‌త్యేక పార్థ‌న‌లు నిర్వ‌హించారు. వైఎస్ భార‌తి, విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌, ప‌లువురు మంత్రులు, వైసీపీ నేత‌లు రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి నివాళులు అర్పించారు.

అంత‌క‌ముందు..సీఎం జ‌గ‌న్ భావోద్వేగ ట్వీట్ చేశారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి భౌతికంగా దూర‌మై 12 ఏళ్లుయినా జ‌నం మ‌నిషిగా, త‌మ ఇంట్లోని స‌భ్యునిగా నేటికి జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నార‌న్నారు. చిరున‌వ్వులు చిందించే ఆయ‌న రూపం, ఆత్మీయ ప‌ల‌క‌రింపు మ‌దిమ‌దిలోనూ అలాగే నిలిచి ఉన్నాయ‌ని చెప్పారు. తాను వేసే ప్ర‌తి అడుగులోనూ, చేసే ప్ర‌తి ఆలోచ‌న‌లోనూ నాన్న స్పూర్తి ముందుకు న‌డిపిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

క‌డప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్‌కు పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. కడప విమానాశ్రయం వద్ద, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.

Next Story
Share it