గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చి వేసిన 9 ఆల‌యాల పునః నిర్మాణానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ శుక్ర‌వారం భూమిపూజ నిర్వ‌హించారు. విజ‌వాడ న‌గ‌రంలోని ప్ర‌కాశం బ్యారేజీకి స‌మీపంలో కృష్ణా నది ఒడ్డున ఉదయం 11.01కి సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రూ.77కోట్ల‌తో దుర్గ‌గుడి అభివృద్ది విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. కృష్ణా న‌ది తీరంలో గ‌తంలో ఉన్న 9 ఆల‌యాల‌ను 2016 పుష్క‌రాల స‌మ‌యంలో తొల‌గించారు. ప్ర‌స్తుతం వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.


పునర్నిర్మించే ఆలయాలు ఇవీ..

1. రాహు – కేతు ఆలయం

2. సీతమ్మ పాదాలు

3. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో)

4. శనైశ్చర ఆలయం

5. బొడ్డు బొమ్మ

6. ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద)

7. సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం

8. వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో)

9. కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల


తోట‌ వంశీ కుమార్‌

Next Story