సామాజిక పెన్షన్ రూ.3వేలకు పెంపు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 11:45 AM GMTసామాజిక పెన్షన్ రూ.3వేలకు పెంపు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ భేటీ జరిగింది. పలు అంశాలపై సీఎం జగన్ మంత్రులు, ఇతర అధికారులతో చర్చించారు. సామాజిక పెన్షన్లు, ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి పెంపు సహా 45 అంశాలపై చర్చించారు. కొన్నింటికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. యాంటి నక్సల్ ఆపరేషన్‌లో పాల్గొనే వారికి 15 శాతం అలవెన్స్ పెంపునకు ఏపీ కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే కోర్టు సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపుపై కేబినెట్‌లో చర్చ జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యంగా జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3,000వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితిని రూ.2లక్షలకు పెంచింది. జనవరిలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలుకు కూడా ఏపీ మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఏపీ మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
* సామాజిక పెన్షన్లను రూ.2,750 నుంచి రూ.3వేల వరకు పెంచాలనే నిర్ణయానికి ఆమోదం
* వైఎస్సార్ ఆరోగ్యెలో పేదలకు రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం
* ఏపీలోని 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యక్ష సేవలు
* డిసెంబర్ 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం
* విశాఖలో లైట్‌మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్
* జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం
* కుల, ఆదాయ సర్టిఫికెట్ల మంజూరులో సంస్కరణకు మంత్రివర్గం ఆమోదం
* కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపు
* యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో పనిచేసే టీమ్స్‌కు 15 శాతం అలవెన్స్
* ఆడుదాం ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్‌గా అంబటి రాయుడు