AP Assembly Sessions : గవర్నర్ ప్రసంగం హైలైట్స్ ఇవే..!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు గారు, సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.
By - Medi Samrat |
గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు గారు, సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. ఆనంతరం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
గవర్నర్ ప్రసంగం హైలైట్స్..
* విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్ధిక కష్టనష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించింది.
* విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారు
* వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి ఆగిపోయింది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు పెరిగాయి
* శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా గత పాలకులు పాలించారు. 22ఏ దుర్వినియోగం చేశారు
* మౌలిక వసతులైన విద్యుత్, సాగునీరు, రహదారులు లాంటి రంగాల్లో అభివృద్ధి కుంటుపడింది
* 2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాద్యతను కూటమికి ప్రజలు అప్పజెప్పారు
* చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి పాలన సాగిస్తోంది
* గత 19 నెలల కాలంలో రాష్ట్రాన్ని పునర్నించి గాడిలో పెట్టింది. సూపర్ సిక్స్ సహా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రీస్టార్ట్ అయ్యాయి
* తొలి 9 నెలల కాలంలో దిద్దుబాటు చర్యలు, పాలసీలు వ్యవస్థల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది
* 7 శ్వేత పత్రాలను విడుదల చేసి పారదర్శకమైన పాలనను కూటమి ప్రభుత్వం చేపడుతోంది
* స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పాలన సాగిస్తోంది
* పది సూత్రాలను నిర్దేశించుకుని సుపరిపాలనను ప్రజలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది
* అభివృద్ధిని సంక్షేమం సమతూకంగా పరిపాలన సాగిస్తోంది
* ప్రజా సంక్షేమం అనే కోణంలోనే ప్రతీ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది
* ఏడాదికి రూ.33 వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోంది
* 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రయోజనం కలిగిస్తున్నాయి.
* 66 లక్షల మందికి పైగా విద్యార్ధులకు తల్లికి వందనం ద్వారా ఆర్ధిక సాయం అందుతోంది
* స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతోంది
* అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల చొప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతోంది
* దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మందికి పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం
* మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు, 5757 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసింది
* మత్స్యకార సేవలో పథకం ద్వారా 1.2 లక్షల మందికి రూ.20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందుతోంది
* 1 లక్షమందికి పైగా హ్యాండ్లూమ్, పవర్ లూమ్‌లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోంది.
* జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోంది.
* ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ప్రతీ కుటుంబానికి అవసరమైన ప్రయోజనాలను అందిస్తున్నాం
* త్వరలో ఫ్యామిలీ కార్డును ప్రభుత్వం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది
* పీ4 ద్వారా పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
* ఎవరూ ఆకలితో ఉండకూడదనే సూత్రంతో 113 నియోజకవర్గాల్లో 205 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది
* త్వరలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ గ్రామీణ అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది
* అందరికీ గృహాలు అనే లక్ష్యంతో గృహనిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది
* ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా చేసింది
* గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది
* బీసీల అభ్యున్నతికి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది
* ఎంస్ఎంఈల ద్వారా బీసీ వర్గాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది
* మైనారిటీలకు భద్రత, వారికి అభివృద్ధిలో భాగస్వామ్యం, విద్య, ఆర్ధిక సహకారంతో మేలు చేకూరుస్తోంది
* వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ లాంటి రంగాల్లో దూసుకెళ్తోంది
* ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తోంది.
* అంతర్జాతీయ సంస్థలు ఏపీని పెట్టుబడులు, నాలెడ్జి ఎకానమీకి గమ్యస్థానంగా ఎంచుకున్నాయి
* టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా యువతకు భవిష్యత్‌లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది
* ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తోంది.
* యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
* రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి రూ.2.5 లక్షల వరకూ సమగ్ర ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది
* 1.43 కోట్ల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.
* క్యాన్సర్ సహా ఇతర ఖరీదైన చికిత్సలకు ఎలాంటి పరిమితి లేకుండా ప్రభుత్వం ఈ బృహత్ పథకాన్ని చేపడుతోంది
* వృద్ధుల సంఖ్య పెరగడం వివిధ దేశాలకు సవాల్‌గా మారింది. దీనిపై సరైన విధానాన్ని రూపొందించాలని సభను కోరుతున్నాను.
* అక్రమ మద్యం తయారీ నుంచి విముక్తి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గంజాయి నిర్మూలనలో పురోగతి సాధించింది.
* యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రణాళికలు చేసింది
* గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచారు.
* అభివృద్ధి వ్యూహంలో మహిళలే కేంద్ర బిందువులు, ఆర్ధిక భాగస్వాములు, స్వయం పేరుతో డ్వాక్రా మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తోంది
* ఏడాదికి లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. వచ్చే ఏడాది 5 లక్షల మంది మహిళను పారిశ్రామిక వేత్తలుగా మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది
* అంగన్ వాడీలను బలోపేతం చేసి, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి ద్వారా మహిళలకు న్యాయ సహకారం కూడా అందిస్తోంది.
* ప్రాంతీయ సమానత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పోర్టులు, రోడ్లు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలు, పరిశ్రమల పెట్టుబడులతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
* వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, సేవా రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
* ఆర్ధిక క్రమశిక్షణ, పెట్టుబడుల్లో వేగం, మౌలిక వసతుల అభివృద్ధి వంటివి ఆర్ధిక కార్యలాపాలకు దోహద పడుతున్నాయి.
* రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థకు పోలవరం ప్రాజెక్టు వెన్నెముక. 2027 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉంది.
* కరవు ప్రభావిత ప్రాంతాలకు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రభుత్వం నీరు అందిస్తోంది.
* నల్లమల సాగర్ – నదుల అనుసంధానం ద్వారా పోలవరం నుంచి గోదావరి వరద జలాలను తరలించాలని ప్రభుత్వం సంకల్పించింది.
* వంశధార నుంచి దక్షిణ భారత్‌లోని నదీ వ్యవస్థలను అనుసంధానించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది
* గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల ఏర్పాటు, యాత్రీకులకు వసతి, రవాణా వంటి ఏర్పాట్ల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది.
* 28 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేసేలా కార్యాచరణ చేపడుతోంది.
* విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా రీజియన్లు ఏర్పాటు చేసి ఈ ప్రణాళికలు అమలు చేస్తోంది
* కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన సిటీ ఎకనామిక్ రీజియన్లు ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయి
* విజయవాడ, గుంటూరు, అమరావతిల మధ్య రాజధాని నిర్మాణంతో లాజిస్టిక్స్, ప్రముఖ సంస్థల ఏర్పాటు, ఇతర ఆర్ధిక లావాదేవీలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది.
* ఈ మూడు ప్రాంతాలు టైర్ 2 నగర సమూహంగా ఎదుగుతున్నాయి.
* పోర్టు ఆధారిత అభివృద్ధి, ఆక్వా కల్చర్ , తీరప్రాంత సుస్థిరాభివృద్ధి, రాయలసీమలో ఉద్యాన పంటలు, గిరిజన ప్రాంతాల్లో విలువ ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది
* క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌తో అమరావతి కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టింది.
* ప్రపంచంలో కొద్ది ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండే క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలు ఏపీలో స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది
* అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రభుత్వం వేగంగా చేపట్టింది. రాజధాని రైతుల్లో విశ్వాసం పెరిగింది.
* అమరావతిని శాశ్వత రాజధానిగా ఉండేలా చట్టబద్దత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రక్రియ ప్రారంభించింది.
* విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
* కేంద్ర బడ్జెట్‌లో మూడు హైస్పీడ్ రైల్ కారిడార్‌లు ఏపీ మీదుగా వెళ్లనున్నట్టు ప్రకటించడం కీలకమైన అంశం
* రాష్ట్ర ప్రభుత్వం 25కు పైగా కొత్త పాలసీలను ప్రకటించి రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది
* పారిశ్రామిక ప్రగతి కోసం 175 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
* విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక క్లస్టర్ల ద్వారా ప్రాంతీయ సమతుల్యతను ప్రభుత్వం సాధిస్తోంది
* స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ , ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ , క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ సిటి, సెమీ కండక్టర్ ఎకో సిస్టం లాంటివి ఏపీ అభివృద్ధికి కీలకం అవుతాయి.
* గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సహా పునరుత్పాదక ఇంథనం ద్వారా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
* ఏపీని క్లీన్ ఎనర్జీ ఎకనామిక్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
* విద్యుత్ వినియోగదారులపై భారం వేయకుండా రూ.4,498 కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.
* తొలిసారిగా ట్రూ డౌన్ విధానం ద్వారా ప్రజలపై యూనిట్ కు 13 పైసల చొప్పున విద్యుత్ భారాన్ని తగ్గించింది.
* గతంలో తప్పుడు నిర్ణయాలతో ధ్వంసమైన ఏపీ విద్యుత్ రంగం ఇప్పుడు జాతీయ స్థాయిలో మోడల్‌గా అవతరించింది
* తక్కువ ధరతో డేటా సెంటర్లకు విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
* సీఐఐ సదస్సు ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 610 ఎంఓయూలు కుదిరాయి
* వీటి ద్వారా 16.13 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
* 14 ఎస్ఐపీబీ ల ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపి పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది
* పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చి ఆ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది
* కేంద్ర బడ్జెట్‌లో అరకు లోయ, పులికాట్ సరస్సుల వద్ద టూరిజం అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావించారు.
* వీటిని ఉపయోగించుకుని ఈ రంగంలో పెద్దఎత్తున ప్రాజెక్టులు సాధించేలా చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం
* సాగునీటి రంగం అభివృద్ధిలో కీలకంగా మారింది. తక్కువ వర్షపాతం కలిగిన అనంతపురం లాంటి ప్రాంతాలు హార్టీ కల్చర్ హబ్‌గా మారుతున్నాయి
* పీఎం ప్రణామ్ పథకం ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గించి భూసారాన్ని మెరుగుపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
* పొగాకు, కోకో వంటి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులను ప్రభుత్వం ఆదుకుంది.
* 2030 నాటికి అరకు కాఫీ, కోకో ప్రాసెసింగ్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
* పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం సులభరీతిలో సేవలు అందిస్తోంది.
* అలాగే డేటా ఆధారిత నిర్ణయాలను తీసుకుని వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటోంది
* వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
* యువపారిశ్రామిక వేత్తలు దీనిని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహన్ని అందిస్తోంది
* ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు 26 జిల్లాలను 28కి ప్రభుత్వం పెంచింది.
* భూమి రికార్డులను డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భద్రపరచటంతో పాటు సర్వే ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తోంది
* ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయటంతో పాటు 22 ఏ కింద పెట్టిన భూములను ప్రభుత్వం సమీక్షిస్తోంది.
* స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. గత పాలకులు వదిలి వెళ్లిన చెత్తను తొలగించి సర్క్యులర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తోంది
* మన మిత్ర వాట్సప్ ద్వారా ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలను దగ్గర చేసింది రాష్ట్ర ప్రభుత్వం
* 18 ఏళ్ల వయసు లోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ విధించేలా చట్టం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది
* ఆర్ధిక ఒత్తిళ్లు, బాధ్యతలూ ఉన్నా క్రమశిక్షణతో ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది
* 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీ రూ.17.62 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు చేరింది
* వ్యవసాయంలో వృద్ధి 7.83 శాతం నమోదైంది. పరిశ్రమల రంగం 9.73 శాతం, సేవల రంగం 12.94 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి
* హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.