ఏపీ బ‌డ్జెట్ హైలెట్స్‌.. కేటాయింపులు ఇలా..

AP Assembly budget session 2021.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 11:57 AM IST
AP assembly budget

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ వ‌ర్చువ‌ల్ విధానంలో ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొన‌డంలో రాష్ట్రం.. దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోందని, సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలోనూ ఉందన్న గవర్నర్.. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు సెల్యూట్ చేశారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై క‌రోనా దుష్ర్ప‌భావం చూపిస్తున్న‌ప్ప‌టికీ సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తున్నామ‌న్నారు.

ఇక రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారి ఏపీ ప్ర‌భుత్వం తొలిసారి జెండ‌ర్ బేస్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతోంది. ఇందులో భాగంగానే మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు ప్రాధాన్య‌త ఉండేలా బ‌డ్జెట్‌ను రూపొందించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

ఏపీ బ‌డ్జెట్ హైలెట్స్‌..

2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు

- బీసీ కులాలకు రూ. 28,237 కోట్లు

ఈబీసీ సంక్షేమానికి రూ. 5,478 కోట్లు

కాపు సంక్షేమం కోసం రూ. 3,306 కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 359 కోట్లు

ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ. 17,403 కోట్లు

ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 6,131 కోట్లు

మైనారిటీ యాక్షన్ ప్లాన్ కింద రూ. 3840 కోట్లు

మైనార్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 1756 కోట్లు

మహిళా సంక్షేమానికి రూ. 47,283 కోట్లు

వ్యవసాయానికి రూ. 11,210 కోట్లు

విద్యారంగానికి రూ. 24,624 కోట్లు

వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,830 కోట్లు

చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు

వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 17 వేల కోట్లు

వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,845 కోట్లు

జగనన్న విద్యాదీవెనకు రూ. 2500 కోట్లు

జగనన్న వసతి దీవెనకు రూ. 2,223 కోట్లు

వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు

డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు

పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు

మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు

మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు

డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు

పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు

వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు

Next Story