ధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు

Another case registered on TDP leader Dhulipalla Narendra.తెలుగుదేశం పార్టీ నేత‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 1:07 PM GMT
ధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు

తెలుగుదేశం పార్టీ నేత‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై మ‌రో కేసు న‌మోదైంది. కొవిడ్‌, క‌ర్ప్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న‌పై విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. నింబంధనలు ఉల్లంఘించి 20 మందితో హోటల్‌లో మీటింగ్ పెట్టారని స్థానిక ఎస్సై ఫిర్యాదుపై కేసు న‌మోదైంది. నరేంద్రపై ఐపీసీ సెక్షన్ 188, 269, రెడ్ విత్ 34 (3) eda కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సంగం డైరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ను విచారిస్తున్నారు పోలీసులు. అయితే 12 మందితోనే సమావేశం పెట్టుకున్నామని చెబుతోంది సంగ యాజమాన్యం.

సంగం డైరీ లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఏప్రిల్ 24 తెల్లవారు ఝూమున ఏసీబీ అధికారులు గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన్ను అరెస్ట్ చేశారు. హైకోర్టు ష‌ర‌తులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లకు కోర్టు సూచించింది. టీడీపీలో క్రియాశీలక నేతగా ఉన్న నరేంద్ర టీడీపీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 2019 గా పొన్నూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవుతూ వచ్చారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో కిలారి వెంకటరోశయ్య చేతిలో ఓడిపోయారు. నరేంద్ర 2010 నుంచి సంగం డైరీకి ఛైర్మన్ గా ఉంటున్నారు.

Next Story