వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు

వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  3 Jun 2024 12:55 PM IST
andhra Pradesh, ycp mla pinnelli, supreme court,

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు 

వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా మే 13న మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ఇటీవల ఏపీ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. పిన్నెల్లిని అరెస్ట్ చేయకుండా ఉండాలని మినహాయింపు ఇచ్చింది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు హాని ఉందని పిటిషన్‌లో పిటిషన్‌లో పేర్కొన్నారు.

తాజాగా శేషగిరి రావు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్దకు పిన్నెల్లి వెళ్లకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటును కూడా ఎత్తివేయాలని శేషగిరి రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో.. స్పందించిన సుప్రీంకోర్టు పిన్నెల్లిని అరెస్ట్ చేయకుండా ముందస్తు ఉపశమనం కలిగించి ఆంధ్రప్రదేశ్ హైకోరట్ఉ తప్పు చేసిందని వ్యాఖ్యానించింది. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అంటూ కామెంట్స్‌ చేసింది. అలాగే పిన్నెల్లి కేసును ఈ నెల 6వ తేదీన విచారించి పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

Next Story