ఏపీలో రోడ్డు ప్రమాదాలు, ఆరుగురు దుర్మరణం
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 6 July 2024 8:45 AM ISTఏపీలో రోడ్డు ప్రమాదాలు, ఆరుగురు దుర్మరణం
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన రామాపురం మండలం కొండవాండ్లపల్లి దగ్గర చోటు చేసుకుంది.
కొండవాండ్లపల్లి దగ్గర కారును గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అలాగే స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. విచారణ తర్వాత తదుపరి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయి. టూరిస్టులు బస్సు కట్టుకుని.. అనంతపురం నుంచి తమిళనాడు వెళ్తుండగా ఈ బస్సు బోల్తా పడింది. మృతులు సత్యసాయి జిల్లాకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.