ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ టీడీపీలో భారీ మార్పు చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 4:46 PM ISTఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ టీడీపీలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ టీడీపీకి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు కొత్త బాస్‌ను నియమించారు. ఏపీ టీడీపీ చీఫ్‌గా పల్లా శ్రీనివాసరావుని ఎంపిక చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారికంగా ఈ ప్రకటన చేశారు. టీడీపీ అధ్యక్షుడిగా తనని ప్రకటించడంతో.. తాజాగా పల్లా శ్రీనివాసరావు చంద్రబాబుని కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఎంగా బాధ్యతలు తీసుకున్న ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు భారీ మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి అమర్‌నాథ్‌ను చిత్తుగా ఓడించిన పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు శుక్రవారం వ్యవయశాఖను కేటాయించారు సీఎం చంద్రబాబు. ఈనేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు. దాంతో.. ఆ పదవిని ఇటీవల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకి అప్పగించారు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావుకి టీడీపీ చీఫ్ బాధ్యతలు ఇవ్వడంతో టీడీపీ కేడర్ ఆయనకు అభినందనలు చెబుతున్నారు. మరోవైపు తనకు చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా నిర్వర్తిస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు.