రాజీనామాకు రెడీ అంటూ ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 7:09 AM ISTఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. గత ఐదేళ్లలో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామని అటవీశాఖ చెబుతోందని అన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్‌లో నిర్వహించిన వనమహోత్సవ సభలో పాల్గొన్న ఆయన సవాల్ విసిరారు. గత ఐదేళ్లలో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటినట్లు నిరూపిస్తే తన పదవకి రాజీనామా చేస్తానని అన్నారు. సోషల్ ఆడిట్లో 60 లక్షల మొక్కలునాటినట్లు నిరూపించాలని అయ్యన్నపాత్రుడు చాలెంజ్ విసిరారు. అలాగే అయ్యన్నపాత్రుడు అటవీశాఖ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారన ర్సీపట్నం డివిజన్‌లో ఉన్న సామిల్లో కలప స్మగ్లింగ్ జరుగుతోందనీ.. దీనికి కొంత మంది అటవీశాఖ అధికారులే సహకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్మగ్లింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను అలాగే అక్రమాలకు సహకరించిన అధికారుల పేర్లతో తయారు చేసిన జాబితాను జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడే అందించారు.
అందరి సమక్షంలో వివరాలు అందజేస్తున్నానని దీనిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించేందుకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అయ్యన్నపాత్రుడు. ప్రతి స్కూల్, కాలేజీలో మొక్కలు నాటే విధంగా ప్రతిపాదన చేయాలన్నారు. ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు 3 మొక్కలు పెంచాలని, సంరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పలువురు విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.