నెల్లూరులో స్కూల్‌ గోడ కూలి బాలుడు మృతి.. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల గోడ కూలి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  30 July 2024 8:30 AM GMT
Andhra Pradesh, school wall collapse,  student death,

 నెల్లూరులో స్కూల్‌ గోడ కూలి బాలుడు మృతి.. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల గోడ కూలి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నెల్లూరు నగరం భక్తవత్సల నగర్‌లోని కేఎన్‌ఆర్‌ నగరపాలక పాఠశాల స్కూల్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే.. నాలుగు రోజుల క్రితం ఇక్కడ జరగుతున్న నాడు-నేడు పనుల నాణ్యతా లోపం కారణంగా తొమ్మిదో తరగతి విద్యార్థి గురుమహేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. గోడ కూలి విద్యార్థిపై పడటంతో అతను చనిపోయాడు. నాలుగు రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. పిల్లాడు చనిపోవడంతో అతని కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు లబోదిబో అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.

తాజాగా ఈ సంఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేశ్‌ ఆ బాలుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా.. మంగళవారం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం శ్రీధర్‌రెడ్డి వారి ఇంటికి వెళ్లి ఆ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు.. మరో కుమారుడి చదువు కోసం సహకరిస్తామని శ్రీధర్ రెడ్డి చెప్పారు. అలాగే ఈ సంఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. మానవతప్పిదం ఉందని నివేదికలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.

Next Story