రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

By Srikanth Gundamalla
Published on : 9 Jan 2024 7:30 PM IST

andhra pradesh, rajya sabha, election, three seats,

రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే.. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధిష్టానం తెలిపింది. ఏపీ నుంచి ఆరేళ్ల కింద రాజ్యసభకు ఎంపికైన వారిలో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నుంచి సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్‌లు ఉన్నారు. అయితే.. తాజాగా వీరి పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఈ మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దాంతో.. ఎన్నికలు జరగనున్నాయి.

ఈ మూడు స్థానాలకే సీఎం జగన్‌ వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ముగ్గురిలో ఒకరు ఎస్సీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో రాజ్యసభ సభ్యుల ఎంపికలో బీసీలకు పెద్దపీట వేసిన వైసీపీ.. ఈ సారి ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ముగ్గురు పేర్లను వైఎస్సార్‌సీపీ ప్రకటించనుంది.

Next Story