వాణి, కుమార్తె హైందవిని అరెస్ట్ చేయాలని పోలీసులకు దువ్వాడ ఫిర్యాదు
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 6:28 PM ISTవాణి, కుమార్తె హైందవిని అరెస్ట్ చేయాలని పోలీసులకు దువ్వాడ ఫిర్యాదు
ఏపీ రాజకీయాల్లో గత రెండ్రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ పరిణామాలపై స్పందించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను తెలిపారు.
తాను సంపాదించిన మొత్తం తన భార్య వాణికే ఇచ్చానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. తనపైకి పిల్లలను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. దువ్వాడ వాని, ఆమె కుమార్తె హైందనవిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. వీరిద్దరితో పాటుగా వాణి అనుచరులు గుజ్జు మోహన్ రెడ్డి, కోరాడ కామేష్, మొర్రి శంకరరావు, పొందారు శ్రీనివాసరావు, ఆట్ల రాహుల్ కుమార్ లను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. తానేమీ తప్పు చేయలేదని..తనకెందుకు ఈ శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. తన భర్య వాణి ఎప్పటి నుంచో అధిపత్య పోరు కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా సార్లు ప్రయత్నం చేశారని తెలిపారు. తన మైనింగ్ వ్యాపారంలోనూ వాణి పేరుండాలని కోరుకుందని చెప్పారు. తాను టెక్కలిలో ఐదుసార్లు ఓడిపోవడానికి భార్యనే కారణమని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు
ఏం జరిగిందంటే..
గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు.. ఆయన కొత్తగా నిర్మించుకున్న ఇంటికి చేరుకున్నారు. వారిని లోపలికి అనుమతించలేదు. దాంతో.. గేటు బయటే కుమార్తెలిద్దరూ బైఠాయించారు. అర్ధరాత్రి వరకు తమ తండ్రి తమకు కావాలంటూ అక్కడే ఉన్నారు. తమ తండ్రి వేరొక మహిళతో ఉంటున్నారని చెప్పారు. ఆయన ఇంటికి రావడం లేదని, మా నాన్న కోసమే తాము వెళ్లామని అన్నారు. తన భర్తను దివ్వల మాధురి ట్రాప్ చేసిందని దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ అంశంపై స్పందించిన మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిపై కూడా ఆరోపణలు చేశారు. ఆమె తనకు భర్త వద్దు, ఎమ్మెల్యే టిక్కెట్టు చాలు అనుకున్నారని చెప్పింది. ఎలాగూ తప్పుడు ప్రచారం చేశారు కదా, తాను ఇకపై దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానని తెలిపింది. ఒక స్నేహితురాలిగా ఉంటానని, స్నేహితులు కలిసి ఉండ కూడదా? అని ఆమె ప్రశ్నించారు. దువ్వాడ వద్ద ఆస్తులేం లేవనీ.. కుటుంబ సభ్యులకే ఇచ్చారని చెప్పింది. తానే ఎన్నికల సమయంలో దువ్వాడకు ప్రచారానికి డబ్బులు ఇచ్చానని సంచలన విషయాలు చెప్పింది మాధురి.