ఏపీ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్‌ బ్లాక్ చేసిన మెటా

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వాట్సాప్‌ను బ్లాక్‌ చేసింది మెటా.

By Srikanth Gundamalla  Published on  11 July 2024 5:17 PM IST
andhra pradesh, minister nara lokesh, whatsapp blocked ,

 ఏపీ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్‌ బ్లాక్ చేసిన మెటా

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వాట్సాప్‌ను బ్లాక్‌ చేసింది మెటా. వాట్సాప్‌ మాతృ సంస్థగా ఉన్న మెటా లోకేశ్‌ అకౌంట్‌ను బ్లాక్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. నారా లోకేశ్‌ వాట్సాప్‌కు వేలాదిగా మెసేజ్‌లు వస్తుండటంతో దాన్ని బ్లాక్ చేసినట్లు తెలిసింది. టెక్నికల్ సమస్య కారణంగా వాట్సాప్ నిలిచిపో యిందిన స్వయంగా నారా లోకేశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తనకు సమస్యలు చెప్పుకునేందుకు మెయిల్‌ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో తన మెయిల్‌ ఐడీని ప్రకటించారు.

ప్రజలు తమ సమస్యలను వాట్సాప్‌ ద్వారా కాకుండా మెయిల్ ద్వారా తనకు వెల్లడించాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు hello.lokesh@ap.gov.in అనే మెయిల్‌ ఐడీకి సమస్యలు పంపించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యలను నారా లోకేశ్‌కు పంపుతున్నారు. దాంతో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దాంతో.. మెటా ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీకి తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. అయితే మెయిల్ పంపించే వారు సరైన సమాచారం, సమస్యలను తెలియజేయాలని పేర్కొన్నారు నారా లోకేశ్. మెయిల్స్ ద్వారా వచ్చిన సమస్యలను తానే నేరుగా చూస్తానని లోకేష్ స్పష్టం చేశారు.

ఫిర్యాదుల్లో పేరు, గ్రామం, సెల్ నెంబర్, మెయిల్ ఐడీ, వారికి ఉన్న సమస్య, కావాల్సిన సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు పంపించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన యువగళం పాదయాత్రలో భాగంగా ‘హలో లోకేష్’ కార్యక్రమం చేపట్టిన నారా లోకేష్ ఆ పేరుతోనే ఈ మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవడం గమనార్హం.

Next Story