చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదు: నారా లోకేశ్
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని గతంలో తాను చెప్పాననీ.. మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 26 Sep 2024 2:45 PM GMTఏపీలో ఎన్నికల వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెడ్‌బుక్ పేరు బాగా వినిపించింది. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటానమి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీలో రెడ్‌బుక్ ఓపెన్ చేశామని.. ఐపీఎస్‌లు కూడా సస్పెండ్ అయ్యారని ఆయన అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని గతంలో తాను చెప్పాననీ.. మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో కొన్ని యూనివర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చిన లోకేష్.. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని మరోసారి తేల్చి చెప్పారు. తాను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైందని వెల్లడించారుఏ. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని మంత్రి నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. పలువురు ఐపీఎస్‌లు కూడా సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు.
దేవుడి జోలికి వెళ్లినందుకు మాజీ సీఎం జగన్‌కు ఏమైందో ఎన్నికల్లో అంతా చూశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏ మతానికి చెందిన వారైనా.. మిగిలిన అన్ని మతాలను కూడా గౌరవించాలని లోకేష్ సూచించారు. ఇక త్వరలోనే తిరుమలకు వెళ్తానంటున్న వైఎస్ జగన్.. డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.