రైతుల పొల్లాల్లో సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు విడ్డూరం: అచ్చెన్నాయుడు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla
Published on : 30 July 2024 1:30 PM IST

Andhra Pradesh, minister atchannaidu, comments,  jagan

రైతుల పొల్లాల్లో సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు విడ్డూరం: అచ్చెన్నాయుడు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధి రాళ్లపై ఫొటోలు వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించారని విమర్శించారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్‌ తన ఫొటోలను వేయించుకోవడం ఏంటో అర్థం కావడం లేదనీ.. ఇదొక పిచ్చంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా మంత్రి అచ్చెన్నాయుడు పోస్టు పెట్టారు.

రైతు తన పొలంలో దిష్టి బొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు కానీ.. పొలం హక్కు పుస్తకాల మీద దిష్టి బొమ్మ పెడి ఊరుకోడని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సమాధి రాళ్ల మీద ఫొటో పెట్టినట్లుగా.. రైతులందరి పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు ఎందుకు వేయించారంటూ ప్రశ్నించారు. ప్రజల సొమ్మును రూ.650 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్ముల వేసి పబ్లిసిటి చేయించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలకు ఇదంతా అర్థమయ్యింది కాబట్టే జగన్‌ను ఎన్నికల తర్వాత ఇంటికి పంపించారని అన్నారు. ఈ ట్వీట్‌ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు.. మాజీ సీఎం జగన్‌ను ట్యాగ్‌ చేశారు.

రైతు దేశానికి అన్నం పెడతాడనీ.. అలాంటి రైతుల భూముల పాస్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్ములు పెట్టుకోవడం ఏంటో అంటూ అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. అన్నదాతల ఆస్తులపై ఇక జగన్ బొమ్మలు ఉండబోవు అని చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతోనే పాస్‌ పుస్తకాలు ఉంటాయని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇది ప్రజా ప్రభుత్వమనీ.. ప్రజల కోసమే తమ కూటమి ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజా ప్రభుత్వంలో ఉండవని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల ఆత్మగౌరవం, ఆస్తులను కాపాడుతుందని చెప్పుకొచ్చారు.



Next Story