ఏపీలో రేపట్నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవి తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 2:46 PM GMTఏపీలో రేపట్నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవి తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని చెబుతున్నారు. హాల్ టికెట్‌తో పాటు కాలేజీ ఐడెంటిటీ కార్డును పరీక్షల హాల్‌కు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పరీక్ష సెంటర్‌కు సమయానికి చేరుకోవాలని చెబుతున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరనే నిబందన ఉన్నందున కాస్త ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు బ్లూ పెన్నులు మాత్రమే వాడాల్సి ఉంటుంది. విద్యార్థులు క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని పరీక్ష హాల్‌కు రాకూడదని సూచించారు. అలాగే విద్యార్తులకు నిర్దేశించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలి. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్‌ను ప్రోత్సహించే యాజమాన్యాలకు సెక్షన్-25 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉండనుంది.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్:
* మార్చి 1 : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
* మార్చి 4 : ఇంగ్లిష్ పేపర్-1
* మార్చి 6 : మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.
* మార్చి 9 : మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
* మార్చి 12 : ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్ పేపర్-1
* మార్చి 14: కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1
* మార్చి 16: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
* మార్చి 19 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్:
* మార్చి 2 : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
* మార్చి 5 : ఇంగ్లిష్ పేపర్-2
* మార్చి 7 : మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ, సివిక్స్-2.
* మార్చి 11: మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
* మార్చి 13 : ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.
* మార్చి 15: కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2
* మార్చి 18: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).
* మార్చి 20 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-౨