AP: ఇంజినీరింగ్ బాలికల హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు..అర్ధరాత్రి అమ్మాయిల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి.

By Srikanth Gundamalla  Published on  30 Aug 2024 4:01 AM GMT
Andhra Pradesh, hidden camera, engineering, woman hostel, student strike,

 AP: ఇంజినీరింగ్ బాలికల హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు..అర్ధరాత్రి అమ్మాయిల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. ఏకంగా అమ్మాయిల హాస్టల్‌లోనే ఈ కెమెరాలను అమర్చారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల సంఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళన చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. విద్యార్థినుల ఆందోళన విరమింప చేశారు. అయితే..బాలికల హాస్టల్‌ వాష్‌రూముల్లో కూడా హిడెన్ కెమెరాలను పెట్టారంటూ విద్యార్థులు నిరసన చేశారు. సెల్‌ఫోన్ టార్చ్‌ లైట్స్ వేస్తూ.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్‌ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై.. తోటి స్టూడెంట్స్ దాడి చేశారు. ఈ విషయం తెలసుకుని కాలేజీ హాస్టల్‌కు పోలీసులు చేరుకున్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ.. ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్‌ను పోలీసులుప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకూ ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. అయితే.. ఫైనల్ ఇయర్ విద్యార్థికి.. ఒక విద్యార్థిని సహకరించి కెమెరాలను ఏర్పాటు చేసిందని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్‌లో హిడెన్ కెమెరాలను గుర్తించామంటూ సోషల్ మీడియాలో విద్యార్థులు పోస్టులు పెట్టారు. వారం రోజులుగా హిడెన్‌ కెమెరాలను ఏర్పాటు చేసి రికార్డులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో మేనేజ్‌మెంట్‌పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు వివరాలు ఇంకా చెప్పలేదు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.


Next Story