మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులను సవరించిన ఏపీ ప్రభుత్వం
పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరించింది రాష్ట్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 6:14 AM GMTమ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులను సవరించిన ఏపీ ప్రభుత్వం
మరొక నెల రోజులు పూర్తయితే చాలు ఎండాకాలం వచ్చేస్తుంది. అయితే.. ఎండాకాలం అంటే సెలవులే కాదు.. పెళ్లిళ్ల సీజన్ కూడా. వరుసగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. అయితే.. ఈ సారి వేసవిలో మంచి ముహూర్తాలు చూసుకొని పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చిన్నపాటి షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
కాగా.. ప్రస్తుతం సాధారణ వివాహ నమోదు ఫీజు రూ.200 ఉండగా.. వాటిని రూ.500కు పెంచింది. వివాహ వేదిక వద్దే సబ్‌రిజిస్ట్రార్ వస్తే గతంలో రూ.210 చార్జ్ చేస్తుండగా.. ప్రస్తుతం రూ.5000కు పెంచింది ఏపీ ప్రభుత్వం. ఇక ప్రభుత్వ సెలవు రోజుల్లో వివాహాల నమోదు ఫీజును రూ.5వేలుగా నిర్ధారించింది. మ్యారేజ్ రికార్డుల పరిశీలన ఫీజును రూపాయి నుంచి రూ.100కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ కూడా చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్లను మరింత సులభం చేస్తున్నట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కోసం ఇక నుంచి ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.