Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు
డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది.
By అంజి
ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు
అమరావతి: డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు నడవనున్నాయి. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఫస్ట్‌టైమ్ పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. మహిళలు బిజినెస్‌లో రాణించాలని, ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోవాలన్న కాన్సెప్ట్‌తోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఫస్ట్ ఫేజ్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు. డ్వాక్రా సంఘాలు పొదుపు డబ్బుల ద్వారా పెట్రోల్ బంక్ ఖర్చులను భరించనున్నారు. పెట్రోల్ బంకులకు స్థలం చూపడం, అలాగే బిజినెస్ డెవలప్ కావడానికి ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది.
రూ.6 వేల కోట్ల పొదుపు డబ్బులను ఉపయోగించుకుని ఈ ప్లాన్ అమలు చేసేందుకు మెప్మా సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం బైక్‌లు, ఆటోలు ఇచ్చారు. వీటిని రెంట్‌కు తిప్పడానికి ర్యాపిడో సంస్థతో మెప్మా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళల కోసం ఇంటికి కావలసిన వస్తువులన్నీ ఒకే చోట దొరికేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోల్ బంకుల ఏర్పాటు తర్వాత ఇవి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపేందుకు ఆయిల్ కంపెనీల నుంచి పర్మిషన్లు తీసుకుంటోంది ప్రభుత్వం.