Andhra Pradesh: మహిళలకు ఫ్రీ బస్సు ఆలస్యం.. ఎందుకంటే..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
By Srikanth Gundamalla
Andhra Pradesh: మహిళలకు ఫ్రీ బస్సు ఆలస్యం.. ఎందుకంటే..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీని కోసం ఇప్పటి ఇలాంటి పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారు. ఈ మేరకు కార్యాచరణను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈ పథకం అమలు ఆలస్యం అవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగనుంది. ఈ సందర్భాలు పొరుగు రాష్ట్రాల్లో కొనసాగుతోందని చెబుతున్నారు. అందుకే అదనపు బస్సులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది. అంతేకాదు.. ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీని కోసం నివేదికను కూడా సిద్ధం చేశారని సమాచారం.
ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన తర్వాత.. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ప్రారంభిస్తే బాగుంటుందని అంటున్నారు అధికారులు. ఒక వేళ అదనపు బస్సులు లేకుండా చాలీచాలని బస్సు లతో ఈ సదుపాయం కల్పిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ జర్నీపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ, కర్ణాటకలో అధికారులు చేసిన అధ్యయనం వివరాలను సీఎం చంద్రబాబు ఇవాళ పరిశీలిస్తారు. ఈ పథకంపై సీఎం చంద్రబాబు ఇవాళే ప్రకటన చేసే అవకాశం ఉందని
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీలో 10 వేల బస్సులు ఉన్నాయి.. వాటిలో సొంత బస్సులు 8,220 ఉంటే.. మిగిలినవి అద్దె బస్సులు. ఇటీవల 1,480 కొత్త బస్సుల కొనుగోలు చేయగా.. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్ పూర్తిచేసుకొని డిపోలకు వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. దీని కోసం అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. అలాగే 3,500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీచేయాలని నివేదిక రూపొందించారు అధికారులు.