నేడు ఏపీకి అమిత్‌షా.. చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారం

ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  5 May 2024 6:40 AM IST
andhra pradesh, election, political,  campaign,

నేడు ఏపీకి అమిత్‌షా.. చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారం 

ఏపీలో ప్రచారం జోరందుకుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు మరో 8 రోజుల సమయం మాత్రమే ఉన్న కారణంగా.. అన్ని పార్టీలు ప్రచారంలో ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అగ్ర నేతలు కూడా ఏపీలో ప్రచారానికి వస్తున్నారు.

కేంద్ర హోంంత్రి అమిత్‌షా నేడు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రానన్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా పాల్గొంటారు. కడప జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్ఆ ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారని బీజేపీ నాయకులు తెలిపారు. మరోవైపు ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ కూడా రానున్నారని తెలుస్తోంది. ప్రధాని మోదీ 6వ తేదీన రాజమహేంద్రవరం వస్తారనీ.. అక్కడి నుంచి కశింకోట వెళ్తారని తెలుస్తోంది.

కాగా.. ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలిసి అమిత్‌షా ప్రచారంలో పాల్గొంటారు. ధర్మవరంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు చంద్రబాబు, అమిత్‌షా కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి అన్నమయ్య జిల్లా అంగళ్లులో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు హాజరు అవుతారు. అనంతరం సాయంత్రం అనంతపురం అర్భన్ నియోజకవర్గంలోని సప్తగిరి సర్కిల్‌లో ఏర్పాట చేయనున్న ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగిస్తారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ తునిలో వారాహి యాత్రను పవన్ కొనసాగిస్తారు. పవన్‌కు మద్దతుగా మెగా కుటుంబం ఇప్పటికే ప్రచార రంగంలోకి అడుగుపెట్టారు. కొద్దిరోజుల క్రితమే బాబాయ్‌ కోసం హీరో వరుణ్‌ తేజ్‌ ప్రచారం చేశారు. తాజాగా పవన్‌కు మద్దతుగా మరో హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. సాయిధరమ్‌ తేజ్‌ ఆదివారం సాయంత్రం 4 గంటలకు పాత కందరాడ నుంచి రోడ్‌ షోలో పాల్గొంటారు.

Next Story