16 మంది ఐపీఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ షాక్

గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  14 Aug 2024 4:40 PM IST
andhra Pradesh, dgp tirumala rao, 16 ips officers,

16 మంది ఐపీఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ షాక్ 

గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వారికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. పెండింగ్‌లోనే ఉంచారు. తాజాగా ఈ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్‌ క్వార్టర్స్‌లో అందుబాటులే లేరని గుర్తించి.. కీలక ఆదేశాలు జారీ చేశారు.

బదిలీకి గురైన 16 మంది ఐపీఎస్ అధికారులు అందుబాటులో లేకపోవడంపై డీజీపీ తిరుమలరావు సీరియస్ అయ్యారు. ఈ మేరకు వారికి మెమోలు జారీ చేశారు. 16 మంది ఐపీఎస్ అధికారులు డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌కు టచ్‌లో ఉండాలని చెప్పారు. ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, సునీల్ కుమార్‌తో పాటు కాంతి రాణా, అమ్మిరెడ్డి, రఘురామిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి, రవిశంకర్, పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి, పాలరాజు, జుషువా, అన్బురాజన్‌, కృష్ణపటేల్‌కు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డీజీపీ కార్యాలయంలో అందుబాటులో డీజీపీ తిరుమల రావు మెమోల్లో పేర్కొన్నారు. అలాగే అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు. కార్యాలయం వెళ్లేటప్పుడు కూడా సంతకాలు చేయాలని సూచించారు.



Next Story