ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  20 Jun 2024 6:26 AM IST
andhra pradesh, dgp, dwaraka tirumala rao, govt ,

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ద్వారకా తిరుమల రావు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. కోఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించారు. పోలీసు దళాల అధిపతి గా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. బుధవారం రాత్రి సీఎస్ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ద్వారకా తిరుల రావు 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.

ద్వారకా తిరుల రావు గుంటూరువాసి. దేవాపురంలో సామాన్య కుటుంబంలో జనమించారు. తండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అధికారిగా పనిచేశారు. తిరులరావుకి ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. తిరుమలరావు సెంట్రల్‌ యూనివర్సిటీలో మేథ్స్‌‌లో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు. 1989లో ఆయన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్‌. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో తిరుమలరావు కర్నూలు ఎస్పీగా, ధర్మవరం ఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తిరుమలరావు చెన్నై సీబీఐలో కూడా విధులు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా.. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్‌ నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఇప్పుడు సీనియార్టీ ప్రకారం డీజీపీగా నియమితులయ్యారు.

కాగా.. ఏపీ ఎన్నికల వేళ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎన్నికల సంఘం తొలగించింద. ఆయన స్థానంలో హరీశ్‌ కుమార్ గుప్తాను నియమించింది. హరీశ్‌ కుమార్‌ గుప్తానే డీజీపీగా కొనసాగించాలని కూటమి సర్కార్ భావించినా.. ఆ తర్వాత అనూహ్యంగా నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలోనే ద్వారకా తిరుమలరావు డీజీపీగా ెంపిక అయ్యారు. త్వరలోనే డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలను తీసుకోనున్నారు.

Next Story