ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆయన గురించి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో ప్రస్తావన వచ్చిందని ఈ మేరకు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. ఆయన తన సెక్యూరిటీని పెంచి.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిఘా వర్గాలు సూచించాయి.
అయితే.. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరికి అనేది ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ తన భద్రత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు జెడ్‌ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పవన్ కల్యాణ్ ఎన్డీఏ కూటమిలో నేతగా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుదారు కావడంతో సెక్యూరిటీని పెంచే అవకాశాలుఉన్నాయి. కాగా.. కొందరు మావోయిస్టులు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.