డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరో కీలక బాధ్యత
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 8:21 AM IST
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరో కీలక బాధ్యత
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. పలు శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరో కీలక బాధ్యతను సీఎం చంద్రబాబు అప్పగించారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్బంగా వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు.
ఇక అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఒకేసారి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అటవీ సంపద పెంచి.. ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజనానికి వెళ్దామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబుకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.