6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఏపీ కేబినెట్ నిర్ణయం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  31 Jan 2024 8:04 AM GMT
andhra pradesh, cabinet meeting, cm jagan, mega dsc,

6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఏపీ కేబినెట్ నిర్ణయం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ పోస్టుల భర్తీపై చర్చించారు. ఈ మేరకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ పోస్టు భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,100 పోస్టలతో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.

ఏపీలో మొదట టెట్‌ నిర్వహించి.. ఫలితాలు ఇచ్చిన తర్వాతే డీఎస్సీ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2022లో టెట్‌ నిర్వహించారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారు. అందులో 2 లక్షల మంది టెట్‌కు అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌ పరీక్షకు హాజరు అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరో రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఒకేసారి 6వేలకు పైగా టీచర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఉన్నారు.

Next Story