అమరావతి: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 11.30 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 14న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026 - 27 ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ సమావేశాల నుంచి తొలిసారిగా డిజిటల్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టనున్నారు.
కాగా ఇవాళ బడ్జెట్‌పై గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్న నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత జగన్ సభ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసారీ పూర్తి సమావేశాలకు హాజరవ్వడం అనుమానంగానే ఉంది. ఒకవేళ హాజరైతే కల్తీ నెయ్యి అంశంపై కూటమి, వైసీపీ నేతల మధ్య వార్ ఖాయంగా కనిపిస్తోంది.