సీఎం జగన్ నామినేషన్ దాఖలుకి ముహూర్తం ఖరారు
ష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి.
By Srikanth Gundamalla
సీఎం జగన్ నామినేషన్ దాఖలుకి ముహూర్తం ఖరారు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఏపీలో ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఆయన ఏప్రిల్ 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ వేసిన అనంతరం బహిరంగలో పాల్గొంటారు. ఏప్రిల్ 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పులివెందులలో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బాలయ్య కదిరి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఏప్రిల్ 25 నుంచి ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు.