ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 'పుష్ప' సినిమా సీన్ రిపీట్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గంజాయి స్మగ్లర్లు ఫిల్మీ స్టైల్‌లో పోలీసులకు చిక్కారు. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు చేజ్ చేశారు.

By అంజి  Published on  20 Sept 2023 1:01 PM IST
andhra odisha border, Pushpa Movie, AP Police, Ganja Smugglers

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 'పుష్ప' సినిమా సీన్ రిపీట్

ఒడిశా: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గంజాయి స్మగ్లర్లు ఫిల్మీ స్టైల్‌లో పోలీసులకు చిక్కారు. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు చేజ్ చేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని రేకపల్లి గ్రామంలో బొలెరో వాహనంపై భారీగా గంజాయి లోడ్ చేసి.. స్మగ్లర్లు 'పుష్ప స్టైల్'లో తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. AP 07 TK 0466 నంబర్ గల వాహనం రోడ్డుపైకి రాగానే చిత్రకొండ పోలీసులకు సమాచారం అందింది. ఒక పోలీసు పెట్రోలింగ్ వేగంగా వస్తున్న బొలెరోను అడ్డగించింది, కానీ వారు వేగంగా వెళ్లిపోయారు.

చిత్రకొండ పోలీసులు స్మగ్లర్లను వెంబడించారు. దీంతో వెంబడిస్తున్న పోలీసులకు తప్పించుకోవడానికి స్మగ్లర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. పట్టుబడకుండా ఉండేందుకు స్మగ్లర్లు గంజాయి బస్తాలను రోడ్డుపై పడేయడం ప్రారంభించారు. చాలాసేపు వెంబడించిన పోలీసులు చివరికి వాహనాన్ని ఆపగలిగారు. అయితే స్మగ్లర్లు గంజాయిని వదిలి పారిపోయారు. ఈ క్రమంలో పోలీసులు 980 కిలోల గంజాయిని, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా పోలీసులు స్మగ్లర్ల నుంచి దాదాపు రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు.

Next Story